హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 5-1తో గోవాపై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో తెలంగాణ తరఫున సూర్యప్రకాశ్(18ని), అయ్యప్ప(21ని), నీరజ్‌కుమార్(23ని), రోహిత్‌సింగ్(28ని), రాజు(29ని) గోల్స్ చేశారు. త్రిశూల్ గణపతి(19ని) గోవాకు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో పూల్-ఏలో తెలంగాణ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.