హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి ఇంటర్నేషనల్ చాలెంజర్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. స్లోవేనియా వేదికగా ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-రోహాన్ జంట 14-21, 13-21తో జాస్పెర్ టాఫ్ట్-క్లారా గ్రాసెరెన్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.
టోర్నీ ఆసాంతం చక్కటి ఆటతీరు ప్రదర్శించిన భారత జంట.. తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయింది. వరుస గేమ్‌ల్లో ఓటమి పాలై రెండో స్థానంతో సరిపెట్టుకుంది.