హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలలో 2025-26 సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులకు దరఖాస్తులను ఆహ్వానించారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి విడుదల చేశారు. 01-09-2016 నుంచి 30-8-2017 మధ్య జన్మించి 8 నుంచి 9 ఏండ్ల వయసు కలవారు అర్హులు. విద్యార్థులు ఈ వెబ్సైట్(www.tgss. telangana.gov.in) ద్వారా ఈనెల 7 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.