TPGL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్) సీజన్-4లో క్వార్టర్స్ బెర్తులు ఖరారయ్యాయి. సోమవారంతో ముగిసిన లీగ్ దశ పోటీల్లో మెరుగైన ప్రదర్శన ఆధారంగా ఎనిమిది జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.
ఇందులో ఆటమ్ చార్జర్స్, టీమ్ దాసోస్, ఎమ్వైకే స్ట్రైకర్స్, టీమ్ ఎమ్వైఎస్ఏ, గోల్డెన్ ఈగల్స్, రిట్జ్ మాస్టర్స్, వ్యాలీ వారియర్స్, టీమ్ టీఆఫ్ ఫేయిర్మౌంట్ ఉన్నాయి. రెండో రౌండ్ నుంచి తమదైన దూకుడు కనబరుస్తున్న ఆటమ్ చార్జర్స్ 959 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈనెల 24 నుంచి క్వార్టర్స్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.