హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : పంజాబ్లో జరుగుతున్న జాతీయ పోలీసు స్పోర్ట్స్ మీట్ కోసం తెలంగాణ నుంచి కబడ్డీ, ఖోఖో బృందాలు బయల్దేరి వెళ్లాయి. రాష్ట్రం నుంచి మొత్తం 74 మంది పోలీసు క్రీడాకారులు అక్కడ జరిగే క్రీడల్లో పోటీపడుతున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో ఇప్పటికే ప్రతిభ కనబర్చిన రాష్ట్ర జట్లకు డీజీపీ జితేందర్ అభినందనలు తెలిపారు. పంజాబ్లోను పతకాలు కొల్లగొట్టాలని క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐజీ రమేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.