హైదరాబాద్, ఆట ప్రతినిధి: డెహ్రాడూన్ వేదికగా 5వ కేఐవో జాతీయ జూనియర్, క్యాడెట్, జూనియర్ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. శనివారం ముగిసిన టోర్నీలో పురుషుల జూనియర్ కుమిటె(60కి) విభాగంలో రాష్ర్టానికి చెందిన అమ్రాది విశాల్‌రెడ్డి పసిడి పతకంతో మెరిశాడు. మరోవైపు మహిళల క్యాడెట్ కోటా క్యాటగిరీలో తలపత్రి ఆరాధ్య కాంస్యం ఖాతాలో వేసుకుంది. ర్యాన్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న విశాల్‌రెడ్డి, ఆరాధ్య..జాతీయ స్థాయిలో వివిధ రాష్ర్టాలకు చెందిన ప్లేయర్లతో పోటీపడి పతకాలు కైవసం చేసుకున్నారు.