హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 8: స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల రెండో రోజు జరిగిన బాలుర అండర్-18 100మీ రేసులో గణేశ్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇదే విభాగంలో హర్షవర్ధన్, అశోక్ వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బాలుర అండర్-20 100మీ రేసులో కైఫ్‌కు పసిడి లభించగా, రాఘవేంద్ర, గణేశ్‌కు రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు. 100మీ రేసులో షేక్ సుహానీ(అండర్-18), ప్రవళిక(అండర్-20) స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.
జావెలిన్‌త్రో(అండర్-20)లో స్వామి పసిడి విజేతగా నిలిచాడు. ముగింపు కార్యక్రమంలో పారాలింపియన్ దీప్తి, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ రమేశ్, అసోసియేషన్ ప్రతినిధులు సారంగపాణి, రాజేశ్వర్‌రావు, కుమార్‌యాదవ్, డీవైఎస్వో అశోక్‌కుమార్ పాల్గొన్నారు.