హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగిన జాతీయ వీల్‌చైర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రన్నరప్‌గా నిలిచింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన టోర్నీలో కర్ణాటక చాంపియన్‌గా నిలువగా, తెలంగాణ, మహారాష్ట్ర వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో తెలంగాణకు చెందిన రమావత్ కోటేశ్వర్ విలువైన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచిన ప్లేయర్లను సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు ఎంపిక చేయనున్నారు. ముగింపు కార్యక్రమంలో వీల్‌చైర్ హ్యాండ్‌బాల్ జాతీయ కోచ్ ఆనంద్, సహాయక కోచ్ రాహుల్, సాయికృష్ణ పాల్గొన్నారు.