Basketball | హైదరాబాద్, ఆట ప్రతినిధి: సరూర్‌నగర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 49వ జాతీయ సబ్‌జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో తెలంగాణ 74-73తో డిఫెండింగ్ చాంపియన్ చత్తీస్‌గఢ్‌ను చిత్తుచేస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఆఖరి క్షణం వరకు హోరాహొరీగా మ్యాచ్‌లో తెలంగాణ ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. రాష్ట్ర జట్టు తరఫున మైత్రి(23), ఆరాధ్య(22), చైత్ర(13) విజృంభించారు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ 64-63తో ఏపీపై గెలిచింది.