IND vs SA | టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా ఆల్ అవుట్ అయింది. 77.3 ఓవర్లలో భారత్ 223 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 201 బంతులు ఆడి 79 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్ చేరాడు.
Innings Break!#TeamIndia all out for 223.
— BCCI (@BCCI) January 11, 2022
Scorecard – https://t.co/yUd0D0YyB7 #SAvIND pic.twitter.com/e4prGUAmwA
పుజారా 43, పంత్ 27, మయాంక్ అగర్వాల్ 15, కేఎల్ రాహుల్ 12, శార్దూల్ ఠాకూర్ 12, రహనే 9, షమీ 7, ఉమేశ్ యాదవ్ 4, అశ్విన్ 2 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా 4 వికెట్లు, మార్కో 3 వికెట్లు, ఎంగిడి, మహారాజ్, ఒలివియర్ తలో వికెట్ తీసుకున్నారు.