India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
India vs New Zealand | హామిల్టన్(Hamilton) వేదికగా న్యూజిలాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాకు(Team India) ఆదిలోనే షాక్ తగిలింది. ఇద్దరు ఓపెనర్లు త్వరత్వరగా ఔటయ్యారు.
India vs New Zealand | హామిల్టన్(Hamilton) వేదికగా న్యూజిలాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాకు(Team India) ఆదిలోనే షాక్ తగిలింది. ఇద్దరు ఓపెనర్లు త్వరత్వరగా ఔటయ్యారు. ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ(1) కేవలం ఒక్క పరుగు చేసి ఆడం మిల్నె బౌలింగ్‌లో డరెల్ మిచెల్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో తడబడుతున్న సంజూ శాంసన్(4) పరుగులే చేసి బ్రాస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లు ఆడమ్ మిల్నే దక్కించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (25పరుగులు), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (12 పరుగు)తో క్రీజులో ఉన్నారు.
భారత్ 5.2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 25పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మయాంక్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక టింక్నర్ తుదిజట్టులోకి వచ్చినట్లు కివీస్ కెప్టెన్ సాంట్నర్ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

