దుబాయ్: టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా కొత్తగా బిలియన్ చీర్స్ జెర్సీని లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఇప్పుడా జెర్సీ ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై మెరిసింది. బుధవారం రాత్రి ఈ జెర్సీని ఆ టవర్‌పై ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. తొలిసారి టీమిండియా జెర్సీని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఈ బిలియన్ చీర్స్ జెర్సీని వంద కోట్ల మంది అభిమానుల చీర్స్ స్ఫూర్తితో తయారు చేశామని ఎంపీఎల్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. గతంలో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లలో టీమిండియాను ఫ్యాన్స్ చీర్ చేస్తున్న సౌండ్వేవ్స్ను ఈ కొత్త జెర్సీలో ఉంచడం విశేషం. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 24న పాకిస్థాన్‌తో ఆడనుంది.
For the first time ever, a Team India Jersey lit up the @BurjKhalifa
— MPL Sports (@mpl_sport) October 14, 2021
The #BillionCheersJersey inspired by the cheers of a billion fans reached new heights, quite literally 🤩 Are you ready to #ShowYourGame & back Team India 🥳 pic.twitter.com/LCUxX6NWqz