INDW VS ENGW :మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ రేసు ఆసక్తిగా మారిన నేపథ్యంలో భారత్ బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. వరుసగా రెండు విజయాల తర్వాత రెండు ఓటములతో వెనకబడిన టీమిండియా ఆదివారం బలమైన ఇంగ్లండ్ (England)ను ఢీకొట్టనుంది. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది హర్మన్‌ప్రీత్ సేన. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే మాజీ ఛాంపియన్‌ను నిలువరించాల్సిందే. అందుకే.. పక్కాగా బ్యాటింగ్, బౌలింగ్ వ్యూహాలు పన్నాలనుకున్న భారత జట్టుకు వరుణుడు షాకిచ్చాడు.
వరల్డ్ కప్‌లో మళ్లీ విజయాల బాట పట్టాలనుకున్న భారత్‌కు ఇంగ్లండ్ సవాల్ ఎదురవుతోంది. హ్యాట్రిక్ విక్టరీలో జోరు మీదున్న నాట్ సీవర బ్రంట్ సేనకు చెక్ పెట్టాలంటే టీమిండియా క్రికెటర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ విజయంపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నందున భారత ప్లేయర్లు సర్వశక్తులు ఒడ్డేందుకు తయారవుతున్నారు. అందుకే.. శనివారం ఎంతో ఉత్సాహంగా నెట్స్ సెషన్‌కు వచ్చారు. కానీ, హర్మన్‌ప్రీత్ బృందం ఉత్సాహంపై వర్షం నీళ్లు చల్లింది.
Putting in the hard yards 💪#TeamIndia all in readiness for their next challenge in #CWC25 🤜🤛#WomenInBlue | #INDvENG pic.twitter.com/QWSMazWs9j
— BCCI Women (@BCCIWomen) October 18, 2025
మ్యాచ్ సన్నద్ధతకు ఎంతో ముఖ్యమైన సెషన్ కాస్త వర్షార్పణం అయింది. అయినా సరే తామంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నామని ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అంటోంది. ఒక విజయం చాలు టీమిండియా పుంజుకోవడానికి అని చెప్పిన ఆమె.. ఇంగ్లండ్ స్పిన్నర్లు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
సంయుక్తంగా వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత్.. ఆరంభ పోరులో శ్రీలంకపై విజయంతో పాయింట్ల ఖాతా తెరిచింది. ఆ తర్వాతి పోరులో పాకిస్థాన్‌పై 89 పరుగుల తేడాతో గెలుపొందింది టీమిండియా. కానీ, వైజాగ్ స్టేడియంలో వరుసగా రెండు ఓటములు ఎదురయ్యాయి. భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో మూడు వికెట్ల తేడాతో పరాజయం తప్పలేదు. దాంతో.. పొరపాట్లను సరిదిద్దుకొని ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలని హర్మన్‌ప్రీత్ టీమ్ పట్టుదలతో ఉంది.