ముంబై: టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ రింకూసింగ్ త్వరలో తన బ్యాచిలర్ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. టీమ్ఇండియా టీ20 జట్టులో సభ్యుడైన రింకూ..సమాజ్‌వాదీ లోక్‌సభ ఎంపీ ప్రియాసరోజ్ను పెండ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు ఒక్కసారిగా శుక్రవారం హల్చల్ చేశాయి.
తన దూకుడైన బ్యాటింగ్‌తో అనతికాలంలోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న రింకూ కుటుంబ సభ్యుల నుంచి పెండ్లి ప్రతిపాదన వచ్చినట్లు ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ పేర్కొన్నారు. అయితే పెండ్లిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశాడు. ఇద్దరి నిశ్చితార్థంపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశాడు.