Team India Debutants | భారత క్రికెట్లో భావితారలు.. సంచలన ప్రదర్శనతో మెప్పించిన కుర్రాళ్లు
Team India Debutants : ప్రపంచ క్రికెట్లో ఎన్నో సంచలనాలకు ఈ ఏడాది ఓ సాక్ష్యంగా నిలిచింది. వన్డే, టీ20, టెస్టు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పసికూనల చేతిలో పెద్ద జట్లు కంగుతిన్నాయి. ఇక టీమిండియా(Team India) విషయానికొస్తే.. ఆరంభం నుంచి ఆసియా కప్(Asia Cup) వరకూ జైత్రయాత్ర కొనసాగించిన రోహిత్ సేన వరల్డ్ కప్(ODI World Cup) ఫైనల్లో ఉసూరుమనిపించింది. మొత్తంగా చూస్తే భారత క్రికెట్ జట్టు గొప్ప విజయాలు, ఊహించని...
Team India Debutants : ప్రపంచ క్రికెట్లో ఎన్నో సంచలనాలకు ఈ ఏడాది ఓ సాక్ష్యంగా నిలిచింది. వన్డే, టీ20, టెస్టు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పసికూనల చేతిలో పెద్ద జట్లు కంగుతిన్నాయి. ఇక టీమిండియా(Team India) విషయానికొస్తే.. సొంతగడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి ఆసియా కప్(Asia Cup) వరకూ జైత్రయాత్ర కొనసాగించిన రోహిత్ సేన వరల్డ్ కప్(ODI World Cup) ఫైనల్లో ఉసూరుమనిపించింది. మొత్తంగా చూస్తే భారత క్రికెట్ జట్టు గొప్ప విజయాలు, ఊహించని పరాభవాలతో 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతోంది. అవును.. నిరుడు ఆఖర్లో, ఈ ఏడాది జట్టులోకి వచ్చిన యువకెరటాలు భావితారలం మేమే అని నిరూపించుకున్నారు. ఐపీఎల్లో సంచలన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో నీలిరంగు జెర్సీ ధరించిన ఆ యంగ్‌స్టర్స్‌పై ఓ లుక్కేద్దాం.
భారత జట్టులోకి రావాలంటే ఇంతకుముందు దేశవాళీ ప్రదర్శనే కొలమానం. కానీ, ఐపీఎల్ రాకతో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఈజీ అయిపోయింది. రెండు సీజన్లలో నిలకడగా రాణిస్తే చాలు నీలిరంగు జెర్సీ ఒంటిపై వచ్చి వాలుతోంది. ఈ ఏడాది తమ ఆటతో కోట్లాది మందిని అలరించి, దేశం తరుఫున ఇరగదీసిన పంచరత్నాలు ఎవరంటే..? యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్. రవి బిష్ణోయ్. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్(T20 World Cup) జట్టులో సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసేంత దమ్మున్న ఈ ఐదుగురి ప్రస్థానం ఇది.
యశస్వీ.. దూకుడుకు కేరాఫ్
పేద కుటుంబంలో పుట్టిన యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) క్రికెటర్‌గా మారడం సినిమా కథను తలపిస్తుంది. క్రికెట్ కిట్లు, ఇతర సామాగ్రి కొనేందుకు డబ్బుల కోసం తండ్రితో కలిసి పానీపూరీలు అమ్మిన ఈ ముంబై కుర్రాడు ఒక్క ఏడాదిలోనే స్టార్ అయ్యాడు. ఐపీఎల్(IPL 2023), రంజీల్లో నిలకడైన ఆటతో టీమిండియా తలుపు తట్టిన యశస్వీ.. ఈ ఏడాది భారత క్రికెట్లో ఓ సంచలనంగా మారాడు. 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్ట్‌హ్యాండర్ ఫాస్టెస్ట ఫిఫ్టీతో పాటు మెరుపు సెంచరీ బాదాడు.

దాంతో ఒకే సిరీస్‌తో టెస్టులు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్‌లోనే వెస్టిండీస్(Westindies)పై శతకంతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత చైనాలో జరిగిన 19వ ఆసియా గేమ్స్(Asia Games 2023)లో నేపాల్‌పై మెరుపు సెంచరీతో యశస్వీ తన బ్యాట్ పవర్ చూపించాడు. మొత్తంగా ఈ ఏడాది అతడు ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక తనకు అచ్చొచ్చిన టీ20ల్లో 15 మ్యాచుల్లోనే 43 పరుగులు సాధించాడు. దూకుడైన ఆటతో జట్టుకు శుభారంభాలు ఇస్తున్న యశస్వీ భవిష్యత్ ఆశాకిరణంగా పేరొందాడు.
తెలుగు కుర్రాడి ప్రతాపం
ఐపీఎల్ వీసాతో టీమిండియా ఫ్లైట్ ఎక్కిన కుర్రాళ్లలో తిలక్ వర్మ(Tilak Varma) ఒకడు. 16వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఫినిషర్‌గా రాణించిన ఈ తెలుగు కెరటం సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన తిలక్ నిలకడకు మారుపేరుగా నిలిచాడు.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన సఫారీ పర్యటనలో పర్వాలేదనిపించాడు. కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతున్న తిలక్.. పలుమార్లు మంచి ఆరంభం లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఈ లెఫ్ట్‌హ్యాండర్ 13 టీ20ల్లో 141.55 స్ట్రైక్ రేటుతో 312 రన్స్ స్కోర్ చేసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. బంతితోనూ రాణించి రెండు వికెట్లు పడగొట్టాడు.
సిక్సర్ల కింగ్ టు ఫినిషర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో ఒక్క మ్యాచ్‌తో స్టార్ అయిన రింకూ సింగ్(Rinku Singh) టీ20ల్లో దుమ్మురేపుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) వేసిన ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ను గెలిపించి రింకూ.. ఈ ఏడాది బ్లూ జెర్సీతోనూ వండర్స్ చేస్తున్నాడు. సిక్సర్ల కింగ్‌గా పేరొందిన ఈ లెఫ్ట్‌హ్యాండర్ ఫినిషర్‌గా జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాడు.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలో రింకూ తన మార్క్ షాట్లతో అలరించి జట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు. ఈ చిచ్చరపిడుగు 12 టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో కలిపి 180.68 స్ట్రైక్ రేటుతో 262 రన్స్ బాదాడు. రింకూ జోరు చూస్తుంటే వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలో జరిగే పొట్టి ప్రపంచ కప్ జట్టులో ఆడడం ఖాయం అనిపిస్తోంది.
చాహల్‌కు పోటీగా ..
నిఖార్సైన స్పిన్నర్, మ్యాచ్ విన్నర్ కోసం చూస్తున్న టీమిండియాకు రవి బిష్ణోయ్(Ravi Bishnoi) వరంలా దొరికాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలో కీలక బౌలర్‌గా ఎదిగిన బిష్ణోయ్.. సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yazvendra Chahal) స్థానానికి ఎసరు పెట్టాడు. బిష్ణోయ్ టీ20ల్లో కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో భాగమవుతున్నాడు.

ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG), పంజాబ్ కింగ్స్(PBKS) తరఫున సంచలన బౌలింగ్‌తో ఈ లెగ్ స్పిన్నర్ భారత జట్టులోకి వచ్చాడు. నిరుడు సెప్టెంబర్‌లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసినా.. ఈ ఏడాది బిష్ణోయ్ అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకూ 21 మ్యాచ్‌లు ఆడిన ఈ యంగ్ సంచలనం 17.38 సగటుతో 34 వికెట్లు నేలకూల్చాడు.
రంజీ సంచలనంగా..
ఈ ఏడాది టీమిండియా తరఫున అదరగొట్టిన పేస్ బౌలర్లలో ముకేశ్ కుమార్(Mikesh Kumar) ఒకడు. లేటు వయసులో జట్టులోకి వచ్చినా ముకేశ్ లేటెస్ట్ సెన్సేషన్‌గా మారాడు. రంజీల్లో, ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరఫున మెరుగ్గా రాణించి భారత జట్టు జెర్సీ వేసుకున్నాడు. ఈ బిహార్ పేస్‌గుర్రం వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో ఏకంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు.

బౌన్స్‌తో పాటు వైవిధ్యాన్ని జోడిస్తూ బ్యాటర్లను బుట్టలో వేసుకోవడంలో ముకేశ్ ఆరితేరాడు. ఈ ఏడాది ముకేశ్ 11 టీ20ల్లో10 వికెట్లు, 6 వన్డేల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ పేసర్ సిరీస్ సిరీస్‌కు మెరుగైన ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి
- MLC Kavitha | మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత
- Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ప్రాత:కాల సేవ.. జనవరి 3 నుంచి ప్రారంభం..!
- AFC Asia Cup | ఆసియా కప్ పోటీలకు భారత సైన్యమిదే.. ఐదోసారైనా కల నిజమయ్యేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

