హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కమిటీ వేయాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి..బీసీసీఐని డిమాండ్ చేశారు. గత 90 ఏండ్లుగా తెలంగాణ క్రికెటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని, మరో 300ల క్లబ్‌లకు అనుమతిచ్చేలా హెచ్‌సీఏను ఆదేశించాలని బీసీసీఐని కోరారు.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాకు అల్లీపురం మెయిల్ ద్వారా లేఖ పంపారు. ‘2005 నుంచి హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరుపాలి. తెలంగాణ 31జిల్లాలకు 300 క్లబ్‌లు మంజూరు చేయాలి’ అని అల్లీపురం కోరారు.