న్యూఢిల్లీ: రిషబ్ పంత్, శిఖర్ ధావన్, ఆకాశ్ చోప్రా, అంజుమ్ చోప్రా, ఆశిశ్ నెహ్రా, మనోజ్ ప్రభావకర్, అజయ్ శర్మ, సంజీవ్ శర్మ లాంటి క్రికెటర్లను అందించిన మేటి క్రికెట్ కోచ్ తారక్ సిన్హా కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్లు. టీమిండియా జట్టుకు ఎంతో మంది క్రికెటర్లను అందించిన ఘనత ఆయనకు ఉన్నది. బ్యాచలర్ అయిన తారక్ సిన్హాకు ఓ సోదరి ఉన్నది. వందలాది మందికి క్రికెట్ పాఠాలు నేర్పిన గురువుగా తారక్ సిన్హాకు గుర్తింపు ఉంది. ఢిల్లీకి చెందిన ఫేమస్ సోనెట్ క్లబ్లో ఆయన్ను అందరూ తండ్రి సమానుడిగా భావిస్తారు. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ తరపున ఆడిన ఎంతో మంది క్రికెటర్లను తారక్ తీర్చిదిద్దారు. క్యాన్సర్ కారణంగా తారక్ మృతిచెందినట్లు సోనెట్ క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది.
2018లో ఆయనకు ద్రోణాచార్య అవార్డు దక్కింది. తారక్ వద్ద శిక్షణ పొందిన క్రికెటర్లలో సురేందర్ ఖన్నా, మనోజ్ ప్రభాకర్, రమణ్ లాంబా, అజయ్ శర్మ, అతుల్ వాసన్, సంజీవ్ శర్మలు ఉన్నారు. ఈ ప్లేయర్లు అంతా ఢిల్లీ క్రికెట్ తరపున, ఆ తర్వాత భారత జట్టు తరపున ఆడారు. 90వ దశంలో ఆకాశ్ చోప్రా కూడా కీలక ప్లేయర్‌గా రాణించాడు. ఆకాశ్ చోప్రా కూడా తారక్ వద్ద శిక్షణ పొందారు. మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కూడా తారక్ క్లబ్‌లోనే రాటుతేలారు. ఆల్‌రౌండర్ రుమేలా ధార్, పేస్ బౌలర్ ఆశిశ్ నెహ్రా, శిఖర్ ధావన్, ప్రస్తుతం కీపర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా సోనెట్ క్లబ్‌లోనే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నారు.
Saddened to hear about the demise of Tarak Sinha sir, one of the best coaches in the country, one that provided India and Delhi with some of the finest cricketers in the country. Even at 70, he used to be a regular at Sonnet.#CricketTwitter
— Shiv Dhawan (@shivdhawan10) November 6, 2021
My heartfelt condolences to the family, friends and trainees of Tarak Sinha Sir. Never met him but heard so many inspirational stories from Nehra and @cricketaakash His contribution to Indian Cricket will be forever remembered. May his soul Rest In Peace. Om Shanti 🕉️ https://t.co/NIxI8111H9
— VVS Laxman (@VVSLaxman281) November 6, 2021