Tamim Iqbal | తమీమ్ ఇక్బాల్ యూటర్న్.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ఢాకా: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి మూడు నెలల ముందు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేశ ప్రధాని షేక్ హసీనా కోరిక మేరకు తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు తమీమ్ శుక్రవారం పేర్కొన్నాడు.
గురువారం వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తమీమ్.. ఒక్క రోజు వ్యవధిలో యూ టర్న్ తీసుకున్నాడు. తమీమ్ మాట్లాడుతూ.. ‘ప్రధాని ఆహ్వానంతో ఆమెను కలిశా. నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడంతో కాదనలేకపోయా’ అని పేర్కొన్నాడు.