Raja Muthupandi : కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండీ (Raja Muthupandi) రజత పతకంతో మెరిసిన విషయం తెలిసిందే. రిషికాంత సింగ్ సిల్వర్, మీరాబాయి చాను గోల్డ్ మెడల్ గెలుపొందిన చోట.. నేను సైతం అంటూ ముత్తుపాండీ 65 కిలోల విభాగంలో వెండిని పట్టేశాడు. తద్వారా భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరింది. అంతర్జాతీయ వేదికపై యావత్ దేశం గర్వపడేలా చేసిన ముత్తుపాండీకి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) భారీ నజరానా ప్రకటించారు.
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండీ సిల్వర్ మెడల్ సాధించాడు. 68 కిలోల విభాగంలో సత్తా చాటిన అతడు.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ముత్తుపాండీ విజయం పట్ల సీఎం జోసెఫ్ విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. కామన్వెల్త్లో రజతంతో తమిళనాడు గర్వపడేలా చేసిన అతడికి భారీ నజరానా ప్రకటించారు ముఖ్యమంత్రి.
#TamilNadu Chief Minister, C Joseph Vijay, announced a Rs 30 lakh cash award for Tamil Nadu weightlifter #RajaMuthupandi, who won a silver medal in the men’s 65 kg #weightlifting event at the #CommonwealthGames in Glasgow. https://t.co/6Kl0wE422p#DTNext #Sports #CMVijay pic.twitter.com/PDhQazAFaf
— DT Next (@dt_next) July 27, 2026
‘అంతర్జాతీయ వేదికపై అబ్బురపరిచే ప్రదర్శన చేసినందుకు ముత్తుపాండీకి రూ.30 లక్షల రివార్డు ఇస్తామని విజయ్ తెలిపారు. గ్లాస్గోలో అతడి విజయం తమిళనాడు రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. ముత్తుపాండీ సిల్వర్ మెడల్ సాధించడం ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలవనుంది. భవిష్యత్‌లో అతడు మరిన్ని విజయాలు సాధించాలని.. తద్వారా తమిళనాడుతో పాటు భారత్‌కు మరింత పేరు తేవాలని నేను కోరుకుంటున్నా’ అని సీఎం విజయ్ పేర్కొన్నారు.
Another lift. Another medal. 🥈
Raja Muthupandi muscles his way to Commonwealth Games silver in the Men’s 65kg event. 🏋️♂️
Watch the Commonwealth Games 2026 TODAY, 2 PM onwards, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels and Sony LIV
#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/SUTs7cv1mH
— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026