జూబ్లీహిల్స్: జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడు విజేతగా నిలిచింది. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన టోర్నీలో తమిళనాడు 188 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. కేరళ 161 పాయింట్లతో రన్నరప్‌గా నిలువగా, మహారాష్ట్ర జట్టు మూడో స్థానం కైవసం చేసుకుంది. డ్రెస్సెడ్-డిసిప్లేన్ విభాగంలో తెలంగాణ టీమ్ ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ సబ్‌జూనియర్, జూనియర్, మాస్టర్స్ విభాగాల్లో జరిగిన పోటీలకు 26 రాష్ర్టాల నుంచి దాదాపు 800 మంది ప్లేయర్లు హాజరయ్యారు. పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.