హైదరాబాద్, ఆట ప్రతినిధి: డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) వేదికగా జరిగిన 20వ జాతీయ షార్ట్ట్రాక్ ఐస్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్కేటర్ తాల్లూరి నయన శ్రీ పసిడితో అదరగొట్టింది. సోమవారం ముగిసిన టోర్నీ బాలికల అండర్-19 విభాగంలో 500 మీటర్లు, 1000 మీ., 1500 మీ. విభాగాల్లో నయన శ్రీ మూడు స్వర్ణాలతో మెరిసింది.
తద్వారా వరసగా మూడో ఏడాది పసిడి పతకాలు సాధించి హ్యాట్రిక్ పూర్తి చేసింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన నయనను..ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్సింగ్, జాతీయ స్కేటింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమితాబ్శర్మ అభినందించారు.