GG vs UPW : సూపర్ ఫామ్‌లో ఉన్న యూపీ ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ (57) హాఫ్ సెంచరీ కొట్టింది.తనూజ ఓవర్లో ఫోర్ కొట్టి అర్ధ శతకానికి చేరువైంది. 34 బంతుల్లోనే 10 ఫోర్లతో ఆమె ఫిఫ్టీ బాదింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన యూపీ వారియర్స్‌ను మెక్‌గ్రాత్, గ్రేస్ హ్యారిస్(34) ఆదుకున్నారు. వీళ్లు భారీ షాట్లు ఆడారు. దాంతో, లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఈజోడీ నాలుగో వికెట్‌కు 78 పరుగులు చేసింది. యూపీ విజయానికి 42 బంతుల్లో 63 రన్స్ కావాలి. డియోల్ 12వ ఓవర్లో హ్యారిస్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టింది. దాంతో, 17 రన్స్ వచ్చాయి.