హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ9 చాలెంజ్ నాలుగో సీజన్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ బంకర్ బస్టర్స్ మళ్లీ విజేతగా నిలిచింది. గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్ఫ్- కంట్రీ క్లబ్లో శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో బంకర్ బస్టర్స్ జట్టు 4.53.5 తేడాతో దాసోస్ బై మహి జట్టుపై విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వర్‌నాథ్, టీ గోల్ఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ఎన్ రెడ్డి, డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి విజేతకు ట్రోఫీ అందజేశారు.