Swapna Barman | హాంగ్జౌ: ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ పోటీల అనంతరం తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత అథ్లెట్ స్వప్న బర్మన్ వెల్లడించింది. ‘ట్రాన్స్‌జెండర్’ వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణలు చెబుతున్నట్లు గురువారం ప్రకటించింది.
2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో స్వర్ణం నెగ్గిన స్వప్న.. ఈ సారి చైనా వేదికగా జరుగుతున్న ఏషియా గేమ్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ గురుకుల అథ్లెట్ నందినిని ఉద్దేశిస్తూ.. ‘ట్రాన్స్‌జెండర్‌తో పోటీ పడి పతకం కోల్పోయా. దయచేసి నా మెడల్ నాకు ఇప్పించండి’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.