ఆస్ట్రేలియాతో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే అర్ధశతకం పూర్తి చేయడానికి ముందు నాలుగైదు డాట్ బాల్స్ ఆడాడు. అతను అనుకున్న షాట్లు ఆడలేకపోయాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తయిందో లేదో.. అవతలి ఎండ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌తో మాట్లాడాడు.
ఈ సందర్భంగా ‘బంతిని కొట్టే మూడ్ రావడం లేదు ఏంటో’ అని సూర్య అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ అవుటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సూర్యనేకాక ఓపెనర్ కేఎల్ రాహుల్ (57) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో భారత జట్టు 186/7 స్కోరు చేసింది. అనంతరం చివరి ఓవర్లో షమీ నిప్పులు చెరగడంతో ఆస్ట్రేలియా జట్టు 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఆరు పరుగుల తేడాతో వార్మప్ మ్యాచ్‌లో గెలిచిన సంగతి తెలిసిందే.
@surya_14kumar – Maarne ka mood hi nahi ho raha yaar
Got out very next ball #AUSvIND #T20WorldCup #T20WorldCup2022 pic.twitter.com/TWBM2zSAtA— Aditya Kukalyekar (@adikukalyekar) October 17, 2022