అంతా బాగున్నప్పుడు ఎందుకు తప్పించారు?
భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ అందించి.. రెండేండ్ల పాటు ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా జట్టును నడిపించిన తనను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి నోరువిప్పాడు. ఆ నిర్ణయంతో షాక్‌కు గురయ్యానని, దాదాపు 40-50 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయానని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
- టీ20 కెప్టెన్సీ, జట్టు నుంచి తొలగించడంపై తొలిసారి స్పందించిన సూర్యకుమార్
న్యూఢిల్లీ: భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ అందించి.. రెండేండ్ల పాటు ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా జట్టును నడిపించిన తనను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి నోరువిప్పాడు. ఆ నిర్ణయంతో షాక్‌కు గురయ్యానని, దాదాపు 40-50 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయానని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత జరిగిన యూకే టూర్‌కు సూర్యను జట్టు నుంచి తప్పించిన సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పును తాను అస్సలు ఊహించలేదని సూర్య తెలిపాడు.
‘జట్టుకు దూరమయ్యాక 40-50 రోజులు ఇంట్లోనే కూర్చుండిపోయా. అసలు ఏం చేయాలో తోచలేదు. నేను క్రికెట్ ఆడాలా? వద్దా? అనే ఆలోచనలు కూడా వచ్చాయి. ఆ సమయంలో నా భార్య నాతో మాట్లాడింది. నువ్వు 20 ఏళ్ల క్రితం ఆటను ఎందుకు మొదలుపెట్టావో ఒకసారి గుర్తుచేసుకో.. ఈ ఆటపై ఉన్న పిచ్చి కోసమే కదా! ఆ పాత పట్టుదలను మళ్లీ బయటకు తీయి అంటూ ఆమె చెప్పిన మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి‘ అని సూర్య వెల్లడించాడు.
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు తన మద్దతు ప్రకటించాడు. కాకపోతే అంతా బాగున్నప్పుడు, వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు మార్పు ఎందుకనే ఆలోచన తనను వేధించిందని చెప్పాడు. ‘కెప్టెన్సీ మార్పును నేను ఊహించలేదు. రాబోయే ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్ వరకు జట్టును తీర్చిదిద్దాలని భావించా. కానీ యాజమాన్యం భవిష్యత్తు కోసం వేరేలా ఆలోచించి నిర్ణయం తీసుకుంది’ అని సూర్య వివరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- surya kumar
- t20
- t20 captaincy
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

