న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తున్న సూర్యకుమార్ యాదవ్.. తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు ఇటీవల వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌కు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి పిలుపువచ్చింది. రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు న్యూజిలాండ్‌తో టీ20 జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతుండగా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లతో పాటు.. ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం జట్లను ప్రకటించింది.