IPL 2025 : ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఇంటికి పంపిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) క్వాలిఫయర్ 2లోనూ రెండొందలు కొట్టింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు ముంబై బ్యాటర్లు. నరేంద్ర మోడీ స్టేడియంలో హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్(44), తిలక్ వర్మ(44)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(36) ధనాధన్ ఆటతో గట్టి పునాది వేయగా.. ఆ తర్వాత జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు సూర్య, తిలక్. వీళ్లు కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పగా.. చివర్లో నమన్ ధిర్(37) తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. డెత్ ఓవర్లలో రన్స్ సాధించాడు. దాంతో, హార్దిక్ బృందం నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2లోనూ తమ మార్క్ ఆటను కనబరిచింది. వర్షం కారణంగా 215 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన పోరులో.. ముంబై ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(36) ధాటిగా ఆడాడు. కానీ, గత మ్యాచ్ హీరో రోహిత్ శర్మ(8) స్టోయినిస్ బౌలింగ్‌లో ఫుల్‌షాట్ కొట్టబోయి వెనుదిరిగాడు. రోహిత్ ఔటయ్యాక జోరు పెంచిన జానీ.. బౌండరీలతో హోరెత్తించాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, , అజ్ముతుల్లా ఓవర్లో ఒక సిక్సర్ బాదిన అతడు తిలక్ వర్మ(44 )తో కలిసి రెండో వికెట్‌కు 46 రన్స్ జోడించాడు. దాంతో, పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 10.83 స్ట్రయిక్ రేటుతో 65 పరుగులు చేసింది.
SKY ➡ 𝟜𝟜 in 𝙌𝟮 ⬅ TV#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #PBKSvMI pic.twitter.com/MxNWfDQPMS
— Mumbai Indians (@mipaltan) June 1, 2025
అయితే.. విజయ్ ఆ తర్వాతి ఓవర్లోనే స్లో బంతితో బెయిర్‌స్టోను ఔట్ చేశాడు. సూర్యకుమార్(44), తిలక్‌లు గ్రౌండ్ షాట్లతో అలరించారు. క్రీజులో కుదురుకున్నాక చాహల్, ఒమర్జాయ్ ఓవర్లలో బౌండరీలు బాదేసిన ఈ జంట 28 బంతుల్లోనే యాభై రన్స్ రాబట్టింది. అర్ష్‌దీప్ ఓవర్లో నమన్ వరుసగా రెండు ఫోర్లతో స్కోర్ 160 దాటించాడు. చివరి బంతిని సైతం బౌండరీ సాధించి 14 రన్స్ పిండుకున్నాడు. ఈ జోడీ ఓవర్‌కు 10 చొప్పున రన్స్ కొడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు.
Na(𝙈𝘼𝙉) of crucial cameos 😎
Final flourish of 37(18) that propelled #MI to a solid total 👌
Updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @mipaltan pic.twitter.com/S8KRr7R37V
— IndianPremierLeague (@IPL) June 1, 2025
కానీ, ఇద్దరూ 44 పరుగుల వద్దే ఔటయ్యారు. అయినా సరే స్కోర్ వేగం తగ్గలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(15) అండతో కుర్రాడు నమన్ ధిర్(47) రెచ్చిపోయాడు. డెత్ ఓవర్లలో చెలరేగిన అతడు.. అర్ష్‌దీప్ ఓవర్లో 3 ఫోర్లతో స్కోర్ 170 దాటించాడు. అజ్మతుల్లా వేసిన 20వ ఓవర్లో రెండో బంతికి ఔటయ్యాడు. చివరి బంతికి రాజ్బవ(8) మూడు రన్స్ తీయడంతో ముంబై 203కు పరుగులు చేయగలిగింది.