MI vs PBKS : ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) చిచ్చరపిడుగు సూర్య కుమార్ యాదవ్(59) హాఫ్ సెంచరీ బాదాడు. పంబాబ్ బౌలర్లను ఉతికేస్తూ ఈ సీజన్లో రెండో అర్ధ శతకం సాధించాడు. మరో ఎండ్‌లో తిలక్ వర్మ 5 పరుగులతో ఆడుతున్నాడు. దాంతో, ముంబై భారీ స్కోర్‌పై కన్నేసింది. 13 ఓవర్లకు స్కోర్.. 109/2.
ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్(8) రబడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారీ షాట్ ఆడి.. బౌండరీ వద్ద హర్‌ప్రీత్ బ్రార్ చేతికి చిక్కాడు. దాంతో, 18 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్ ఔటైనా గత మ్యాచ్‌లో సీఎస్కేపై సెంచరీ బాదిన రోహిత్ శర్మ(36) దంచాడు. హర్షల్ పటేల్ ఓవర్లో రివ్యూ తీసుకొని బతికిపోయిన హిట్‌మ్యాన్ సామ్ కరన్ ఓవర్లో వెనుదిరిగాడు.