చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్

- ధోనీసేనకు నాలుగో టైటిల్
- ఫైనల్లో కోల్‌కతా ఓటమి.. మెరిసిన డుప్లెసిస్, శార్దూల్
ప్రైజ్‌మనీ
- విజేతచెన్నైసూపర్ కింగ్స్ 20 కోట్లు
- రన్నరప్ కోల్‌కతానైట్ రైడర్స్ 12.5 కోట్లు
- పొట్టి ఫార్మాట్లో మూడొందల మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన తొలి ప్లేయర్‌గా మహేంద్రసింగ్ ధోనీ రికార్డుల్లోకెక్కాడు.
- ఐపీఎల్లో చెన్నై నెగ్గిన టైటిళ్ల సంఖ్య. ముంబై ఇండియన్స్ ఐదు ట్రోఫీలతో అగ్రస్థానంలో ఉంది.
- కెరీర్ ఆరంభం నుంచి ఏడో నంబర్ జెర్సీతోనే బరిలోకి దిగుతున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఏడో మేజర్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవడం విశేషం. టీమ్ఇండియా తరఫున 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్‌ట్రోఫీ నెగ్గిన మహీ.. ఐపీఎల్లో నాలుగో టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
పకడ్బందీ వ్యూహానికి పక్కా ప్రణాళిక తోడైతే!
అనుభవసారానికి యువ రక్తం మేళవిస్తే!
తెలివికి తెగువ జోడైతే!
ఇవన్నీ ఏక కాలంలో జరిగితే ఎలా ఉంటుందో.. చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది!! గతేడాది పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ధోనీ సేన.. ఏడాది తిరిగేసరికి ఉత్తుంగ తరంగంలా ఎగిసి టైటిల్ ముద్దాడింది. ఫామ్‌తో సంబంధం లేకుండా.. ఆటగాళ్ల సత్తాపైనే నమ్మకముంచిన మహీ మరోసారి మ్యాజిక్ చేయగా.. యూఏఈలో అడుగుపెట్టాక అద్భుతమైన ఆటతీరుతో వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్‌కు అర్హత సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిమెట్టుపై తడబడింది. పొట్టి ఫార్మాట్లో 300వ మ్యాచ్‌కు నాయకత్వం వహించిన మహేంద్రుడు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ ఖాతాలో వేసుకుంటే.. మూడోసారి ఫైనల్ చేరిన కోల్‌కతా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది!
దుబాయ్: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముద్రపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి విశ్వరూపం చూపింది. వయసైపోయిందన్న వాళ్ల నోళ్లూ మూయిస్తూ.. సత్తా తగ్గిందన్న విమర్శకులకు దీటైన జవాబిస్తూ చెన్నై సింహాలు జూలు విదిల్చాయి. ఫలితంగా ధోనీ సేన నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. లీగ్‌లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో తొమ్మిదోసారి ఫైనల్ చేరిన ధోనీ గ్యాంగ్.. ఏక పక్ష పోరులో కోల్‌కతాను రఫ్ఫాడించింది. ప్రపంచంలో మరే సారథికి సాధ్యం కాని రీతిలో పొట్టి ఫార్మాట్లో 300వ మ్యాచ్ ఆడిన ధోనీ.. మైలురాయి పోరులో అద్భుత విజయాన్నందుకున్నాడు. విజయ దశమి రోజు జరిగిన ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రాబిన్ ఉతప్ప (31; 3 సిక్సర్లు), మోయిన్ అలీ (37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అతడికి సహకరించారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులకే పరిమితమైంది. యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ఆరంభాన్నిచ్చినా.. నితీశ్ రాణా (0), సునీల్ నరైన్ (2), ఇయాన్ మోర్గాన్ (4), దినేశ్ కార్తీక్ (9), షకీబ్ అల్ హసన్ (0) రాహుల్ త్రిపాఠి (2) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, రవీంద్ర జడేజా, హజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చెన్నైకి భారీ స్కోరు అందించిన డుప్లెసిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు చేజిక్కించుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 192/3 (డుప్లెసిస్ 86, మోయిన్ అలీ 37 నాటౌట్; నరైన్ 2/26), కోల్‌కతా: 20 ఓవర్లలో 165/9 (గిల్ 51, వెంకటేశ్ 50; శార్దూల్ 3/38, హజిల్‌వుడ్ 2/29).

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

