భారత్ x దక్షిణ కొరియా
జకార్తా: హాకీ ఆసియా కప్ ఫైనల్కు చేరడమే లక్ష్యంగా సూపర్-4 స్టేజ్ ఆఖరి పోరులో భారత్ బరిలోకి దిగనుంది. మెరుగైన గోల్స్ తేడాతో ఇప్పటికే దాదాపు తుది పోరుకు అర్హత సాధించిన టీమ్ఇండియా.. మంగళవారం దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్-4 దశ తొలి మ్యాచ్లో జపాన్ను చిత్తు చేసిన డిఫెండింగ్ చాంపియన్ భారత్.. మలేషియాతో జరిగిన రెండో పోరును ‘డ్రా’ చేసుకుంది.
ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్ చేరాలంటే.. మలేషియాపై సాధారణ విజయం సాధించినా సరిపోతుంది. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా భారత్ ముందంజ వేసే అవకాశాలున్నాయి. లీగ్ దశ చివరి మ్యాచ్లో ఇండోనేషియాపై 15 గోల్స్ తేడాతో విజయం సాధిస్తేనే సూపర్-4కు చేరనున్న క్లిష్ట పరిస్థితుల్లో భారత్ 16 గోల్స్ తేడాతో విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. అదే రీతిన దక్షిణా కొరియాను కూడా మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టాలని యువ భారత్ తహతహలాడుతున్నది. ఉత్తమ్ సింగ్, సునీల్, బిరేందర్, సూరజ్, పవన్ జోరుమీదుండటం భారత్కు కలిసిరానుంది. మరో మ్యాచ్లో జపాన్తో మలేషియా తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

