IPL 2023: సన్‌రైజర్స్‌కు కీలక పోరాటానికి సిద్ధం అయింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలవాలంటే ఈ రోజు లక్నోతో మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో లాస్ట్ బాల్ విక్టరీ సాధించిన హైదరాబాద్ విజయపథంలో కొనసాగాలని చూస్తోంది.
హైదరాబాద్ పిచ్ ఒకసారి బ్యాటర్లకు అనుకూలించగా మరోసారి బౌలర్లకు అనుకూలంగాఉంటోంది. హైదరాబాద్ పిచ్ మీద సగటు స్కోర్ 170. అయితే ఈ సీజన్లో 5మ్యాచ్‌లు జరగగా 2 మ్యాచుల్లో 150 కంటే తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ రోజు పిచ్ మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మరోసారి పరుగుల పారనుంది.
సన్‌రైజర్స్ ప్రధాన సమస్య బ్యాటర్ల నిలకడలేమి. బౌలర్లు నిలకడగా రాణిస్తున్నప్పటికీ బ్యాటర్లు విఫలమవుతున్నారు. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ మరోసారి బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఫిలిఫ్స్ గత మ్యాచ్‌లో టీంకు అద్భుత విజయాన్నందించాడు. కాబట్టి అతడిని కొనసాగించే అవకాశం ఉంది.
భువనేశ్వర్ బౌలింగ్‌లో డికాక్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔటవ్వలేదు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. రాహూల్ త్రిపాఠి అతడి బౌలింగ్‌లో రెండుసార్లు ఔటయ్యాడు. అంతేకాకుండా మార్క్రమ్ కూడా రెండుసార్లు ఔటయ్యాడు.