Sunil Gavaskar : టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కొన్రాడ్ (Shukri Conrad) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో సఫారీ జట్టు పునరాగమనానికి భారత బోర్డు చేసిన సాయం మర్చిపోయావా? .. మీ దేశంలోని ఎస్ఏ20 లీగ్‌లో ఐదు ఫ్రాంచైజీలు భారతీయులవే అనే సంగతి గుర్తుంచుకో. ఏ రకంగా చూసినా మీబోర్డు, ఆటగాళ్లు భారత్ పట్ల కృతజ్ఞతగా చూపాలి’ అని కొన్రాడ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు సన్నీ.
ఒకప్పుడు సొగసైన తన ఆటతో.. ఇప్పుడు కామెంటేటర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్ గవాస్కర్ జియో స్టార్‌లో మాట్లాడుతూ సఫారీ కోచ్‌కు చీవాట్లు పెట్టాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టు పునరాగమనంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పాత్ర ఎనలేనిది. అంతెందుకు.. మూడేళ్ల క్రితం మొదలైన SA20 లీగ్‌కు సైతం భారత బోర్డు అండగా ఉంది. ఈ లీగ్‌లోని ఐదు ఫ్రాంచైజీలు ఐపీఎల్ జట్లకు సంబంధించినవే. భారత పెట్టుబడిదారుల కారణంగానే చాలామంది సఫారీ క్రికెటర్లు అవకాశాలు దక్కించు కోగలుగుతున్నారు.
🗣 #SunilGavaskar has his say about the South African coach Shukri Conrad’s infamous remark during the Test series! #INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/5x5AUqMn0F
— Star Sports (@StarSportsIndia) November 30, 2025
కొన్రాడ్.. నీ వ్యాఖ్యలు ప్రపంచానికి చెడు సంకేతం ఇచ్చేలా ఉన్నాయి. ఒకసారి గతం గుర్తు చేసుకో. దాదాపు 20 ఏళ్లు మీ జట్టును దూరంగా పెట్టిన ఐసీసీని ఒప్పించడంలో భారత బోర్డు కీలకంగా వ్యవహరించింది. మీ జట్టు పునరాగమనంలో తొలి మ్యాచ్ కూడా భారత గడ్డపైనే ఆడింది. క్రికెట్ పరంగా భారత్, దక్షిణాఫ్రికాలు దశాబ్దాలుగా స్నేహభావంతో మెలుగుతున్నాయి. ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టు పోటీపడుతుంటాయి. అంతేతప్ప.. శత్రుత్వం మచ్చుకైనా కనిపించదు. నువ్వు అనువుకాని వేళలో.. క్రికెట్‌ను ఎంతో ప్రేమించే గడ్డపై తప్పుడు మాట మాట్లాడావు. నిన్ను క్షమాపణలు చెప్పాలని నేను కోరను. కానీ, నీ పొరపాటును నువ్వు తెలుసుకుంటే మంచిది. ఆటలో కొన్నిసార్లు భావోద్వేగ తప్పిదాలు జరగుతుంటాయి. కానీ, నువ్వు ఉన్నతంగా మాట్లాడి ఉండాల్సింది’ అని దక్షిణాఫ్రికా కోచ్‌ను కడిగిపారేశాడు గవాస్కర్
గువాహటి టెస్టులో దక్షిణాఫ్రికా 260-5 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 పరుగులు ఉన్నా.. టీమిండియాను బ్యాటింగ్ ఆడించలేదు సఫారీ కెప్టెన్ తెంబ బవుమా. మూడో రోజు.. నాలుగో రోజు 500 ఆధిక్యం వచ్చా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఇంత ఆలస్యంగా డిక్లేర్ చేశారు ఎందుకు? అనే ప్రశ్నకు కోచ్ కొన్రాడ్ టీమిండియా ఆటగాళ్లను ఎక్కువ సమయం ఫీల్డింగ్ చేయించాలనుకున్నామని చెప్పాడు. మేము త్వరగా డిక్లేర్ చేయాలనుకోలేదు. భారత ఆటగాళ్లను చాలా సేపు ఫీల్డించ్ చేయించాలని అనుకున్నాం. నిజం చెప్పాలంటే భారత్ మమ్మల్ని ప్రాధేయపడేలా (Grovel) చేయాలనుకున్నాం.
We wanted them (India) to really grovel: Shukri Conrad, South Africa coach pic.twitter.com/PTkQH7zrGG
— RevSportz Global (@RevSportzGlobal) November 25, 2025
టీమిండియాకు మ్యాచ్‌లో ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని భావించాం అన్నాడు. నాలుగో రోజు ఆఖర్లో గంట.. ఐదోరోజు మొత్తం క్రీజులో నిలబడి చూపించండి అని సవాల్ విసరాలనుకున్నాం అని కొన్రాడ్ నాలుగో రోజు ఆట పూర్తయ్యాక మీడియాతో అన్నాడు. సఫారీ కోచ్ ఉపయోగించి గ్రోవెల్ అనే పదం ఒకప్పుడు జాత్యహంకారానికి ప్రతీకగా ఉండేది. అయితే.. అతడు ఆ ఉద్దేశంలో ఆ మాట అనకున్నా.. వివాదానికి కేరాఫ్ అయ్యాడు. అహంకారంతోనే అతడు ఆ మాట అన్నాడని పలువురు మాజీలు, కామెంటేటర్లు సఫారీ కోచ్‌పై విమర్శలు గుప్పించారు.