ముంబై: వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. తాజా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీక్.. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దంచికొడుతున్నాడు. ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. ఢిల్లీతో పోరులో దంచికొట్టిన అనంతరం విరాట్ కోహ్లీతో జరిపిన సంభాషణలో.. టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యమని కార్తీక్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. ‘టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో అతడు చోటు దక్కించుకోవాలని బలంగా కోరుకుంటున్నాడు. వయసు పక్కన పెడితే తాజా సీజన్లో అతడి ప్రదర్శన చాలా బాగుంది. క్షణాల్లో మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీల కోసం చేస్తున్న పనినే.. పొట్టి ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరఫున చేయాలని ప్రతి ఒక్కరూ ఆశించేలా ఆడుతున్నాడు’ అని పేర్కొన్నాడు.