Sunil Chhetri | ఛెత్రీని ఊరిస్తున్న శాఫ్ చాంపియన్‌షిప్ రికార్డు.. ఒక్క గోల్ దూరంలో భారత కెప్టెన్
Sunil Chhetri : భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) మరో రికార్డుపై కన్నేశాడు. శాఫ్ చాంపియన్‌షిప్ (SAFF Championship)లో అత్యధిక గోల్స్ రికార్డును సమం చేసేందుకు ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. అవును.. భారత కెప్టెన్ ఒక్క గోల్ కొడితే మాల్దివ్స్ లెజెండ్ అలీ అష్ఫక్....
Sunil Chhetri : భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) మరో రికార్డుపై కన్నేశాడు. శాఫ్ చాంపియన్‌షిప్(SAFF Championship)లో అత్యధిక గోల్స్ రికార్డును సమం చేసేందుకు ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. అవును.. భారత కెప్టెన్ ఒక్క గోల్ కొడితే మాల్దివ్స్ లెజెండ్ అలీ అష్ఫక్ (Ali Ashfaq) సరసన చేరతాడు. అష్ఫక్ 23 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఛెత్రీ ఖాతాలో 22 గోల్స్ ఉన్నాయి.
అంతర్జాతీ ఫుట్‌బాల్‌లో ఈ లెజెండరీ ఆటగాడు 91 గోల్స్ కొట్టాడు. శాఫ్ టోర్నీలో హ్యాట్రిక్ గోల్స్‌తో సత్తా చాటిన ఛెత్రీ నిన్న రాత్రి నేపాల్‌పై ఒక్క గోల్‌తో మెరిశాడు. దాంతో, గ్రూప్-‘ఎ’పోరులో భారత జట్టు 2-0తో నేపాల్(Nepal)ను చిత్తు చేసింది.
గ్రూప్-‘ఎ’లో రెండో స్థానంలో
గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ నమోదు చేసిన కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఈ మ్యాచ్‌లోనూ రాణించాడు. 61వ నిమిషంలో గోల్ కొట్టడంతో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మహేశ్ సింగ్(Mahesh Singh) 70వ నిమిషంలో రెండో గోల్ అందించాడు. దాంతో, భారత జట్టు 2-0తో బంపర్ విక్టరీ కొట్టింది. దాంతో, ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి
Arun Karthik | తమిళనాడు ప్రీమియర్ లీగ్.. మూడు సెంచరీలతో ఆర్సీబీ మాజీ క్రికెటర్ రికార్డు
Sachin Tendulkar | 40 ఏళ్ల క్రితం.. నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే : సచిన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

