కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఛెత్రీ భార్య సోనమ్ భట్టాచార్య గురువారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్టార్ ఫుట్‌బాలర్ అభిమానులతో పంచుకున్నాడు. బాబును ఆహ్వానిస్తూ ఛెత్రీ కుటుంబం, స్నేహితులు సంబురాలు చేసుకున్నారు.
ఇంటర్ కాంటినెంటల్ టోర్నీ సందర్భంగా తన భార్య సోనమ్ తల్లి కాబోతున్నట్లు ఛెత్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే.