SRH vs DC : రికార్డు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) రెండు కీలక వికెట్లు పడ్డాయి. డేంజరస్ ఓపెనర్ పృథ్వీ షా(16)ను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపగా.. ఆ తర్వాత భువనేశ్వర్ నకుల్ బాల్‌తో డేవిడ్ వార్నర్(1)ను బోల్తా కొట్టించాడు. దాంతో, 25 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగారు. ఓ వైపు వికెట్లు పడినా యువకెరటం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(35) బౌండరీలతో చెలరేగుతున్నాడు. దాంతో, ఢిల్లీ స్కోర్3 ఓవర్లకే 55కు చేరింది.
తొలుత ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఈసారి ఢిల్లీ గడ్డపై సిక్సర్ల మోత మోగించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(89), షహ్బాజ్ అహ్మద్(59 నాటౌట్), అభిషేక్ శర్మ(46)లు సునామీలా విరుచుకుపడ్డారు. దాంతో, హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 266 రన్స్ కొట్టింది.