విన్స్టన్ సేలం (నార్త్ కరోలినా): యూఎస్ఏలోని నార్త్ కరోలినా వేదికగా జరుగుతున్న విన్స్టన్ సేలం ఏటీపీ 250 టోర్నీలో భారత టాప్ ర్యాంకు టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో నాగల్ 4-6, 2-6తో బొర్న కోరిచ్(క్రొయేషియా) చేతిలో పరాభవం పాలయ్యాడు. గంటా పది నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్లో కాస్త ప్రతిఘటించిన నాగల్ రెండో సెట్లో మాత్రం చేతులెత్తేశాడు.