IPL 2025 : సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఓపెనర్ సాయి సుదర్శన్(53 నాటౌట్) అర్ధ శతకంసాధించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌండరీతో ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో యాభై మార్క్ అందకున్నాడీ హిట్టర్. ఈ సీజన్లో సాయికి ఇది ఆరో హాఫ్ సెంచరీ. అదే ఓవర్లో శుభ్‌మన్ గిల్ (28 నాటౌట్) భారీ సిక్సర్ బాదడంతో గుజరాత్ స్కోర్ 80 దాటింది. 9 ఓవర్లకు స్కోర్.. 82-0. ఇంకా గిల్ సేన విజయానికి 66 బంతుల్లో118 రన్స్ కావాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 200 ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు దంచేస్తున్నారు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్(53 నాటౌట్) ఫోర్లతో అలరిస్తున్నాడు. అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్లో సాయి బౌండరీ కొట్టగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్( 28నాటౌట్) సిక్సర్ బాదాడు. అనంతరం నటరాజన్ ఓవర్లో సాయి రెచ్చిపోయి 6, 4, 4, 4 సాధించాడు. వీళ్లిద్దరూ ధనాధన్ ఆడుతుండంతో 26 బంతుల్లోనే 50 పరుగులు వచ్చాయి. దాంతో, గుజరాత్ 6 ఓవర్లలో 59 పరుగులు చేసింది.
You say consistency, we hear Sai Sudharsan 🫡
His hunger for runs continues with fifty no. 6️⃣ of the season 👏#GT in control of the chase 🏃
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @gujarat_titans | @sais_1509 pic.twitter.com/e0LGgiyKmT
— IndianPremierLeague (@IPL) May 18, 2025