Sudarsan Pattnaik | ఈ హాకీ స్టిక్ ప్రపంచంలోనే అతిపెద్దది
పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టిక్‌ను రూపొందించారు.
Sudarsan Pattnaik | 2023 పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టిక్‌ను రూపొందించారు.
కటక్‌లోని మహానది తీరంలో తీర్చిదిద్దిన ఈ హాకీ స్టిక్.. ప్రపంచంలోనే అతిపెద్దదని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ఇది 105 అడుగుల పొడవు ఉందని.. దీని తయారీకి 5,000 హాకీ బాల్స్, ఐదు టన్నుల ఇసుకను ఉపయోగించినట్లు చెప్పారు. 15 మంది విద్యార్థుల సాయంతో రెండు రోజుల్లో దీన్ని రూపొందించినట్లు వివరించారు. ఈ అతిపెద్ద హాకీ స్టిక్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
World's longest sand Hockey stick of 105ft long, with installation of 5000 hockey balls on Mahanadi river bank at #Cuttack. Odisha. I with my My team completed within two days . #HockeyComesHome #HockeyWorldCup2023 #HWC2023 #OdishaForHockey pic.twitter.com/QNQArG9tC6
— Sudarsan Pattnaik (@sudarsansand) January 10, 2023
We are creating World's longest sand Hockey stick of 105ft long, with installation of more than 5000 hockey balls on Mahanadi river bank at #Cuttack. Odisha. My Students joined hand with me. #HockeyComesHome #HockeyWorldCup2023 #HWC2023 #OdishaForHockey pic.twitter.com/r5YoF0A5mC
— Sudarsan Pattnaik (@sudarsansand) January 10, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

