Taekwondo Tournament | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మలేషియా వేదికగా ఈ నెల 4 నుంచి ఆరవ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ తైక్వాండో టోర్నీలో రాష్ర్టానికి చెందిన సింధు తపస్వి, అఖిల్ మహర్షి ఎంపికయ్యారు. టోర్నీ కోసం వీరు బుధవారం మలేషియాకు బయల్దేరి వెళ్లనున్నారు.
భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్న భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన సింధుతో పాటు అఖిల్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఎస్పీ వినీత్, కోచ్ జయంత్‌రెడ్డి అభినందించారు.