హైదరాబాద్, ఆట ప్రతినిధి: బిష్కెక్(కజకిస్థాన్) వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్(ఓపెన్ వరల్డ్‌కప్)లో రాష్ర్టానికి చెందిన ప్రదీప్‌కుమార్ పసిడి పతకంతో మెరిశాడు. పురుషుల 82కిలోల కేటగిరీలో బరిలోకి దిగిన ప్రదీప్ 422.5 కిలోల బరువు ఎత్తి స్వర్ణ పతకం దక్కించుకున్నాడు.
ప్రత్యర్థి లిఫ్టర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ప్రదీప్ సత్తాచాటాడు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో అస్టిస్టెంట్ అకౌంట్స్ అధికారిగా కొనసాగుతున్న ప్రదీప్..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా పతకాలు సాధిస్తున్నాడు.