హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. భువనేశ్వర్ వేదికగా జరిగిన టోర్నీలో గ్రూప్-1 కేటగిరీలో వ్రితి 4 స్వర్ణాలు, ఓ రజతం గెలుచుకుంది. ఆదివారం బాలికల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో వ్రితి 2 నిమిషాలా 8.72 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. హషిక రామచంద్రన్, షీరిన్ వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. బాలుర 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సుహాస్ ప్రీతమ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.