హైదరాబాద్, ఆట ప్రతినిధి: పశ్చిమబెంగాల్ వేదికగా జరుగుతున్న జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీలో రాష్ట్ర యువ ఆర్చర్ చికితారావు కాంస్య పతకంతో మెరిసింది. శనివారం మహిళల రికర్వ్ విభాగంలో బరిలోకి దిగిన చికిత 149 స్కోరుతో కాంస్యం కైవసం చేసుకుంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈ యువ ఆర్చర్..జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నది.