మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రస్థాయి అండర్-19 బాల, బాలికల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ల సందర్భంగా ఆయన ప్లేయర్లను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
సింగిల్స్ బాలుర విభాగంలో రుషీంద్ర విజేతగా నిలువగా, నుమెయిర్, ప్రణవ్‌రావు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. బాలికల సింగిల్స్‌లో తన్విరెడ్డి టైటిల్ గెలుచుకుంది. విజేతలకు ఎమ్మెల్యే దివాకర్‌రావు, అదనపు కలెక్టర్ రాహుల్, మున్సిపల్ చైర్మన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.