Mitchell Starc : యాషెస్ సిరీస్‌లో వికెట్ల వేట కొనసాగిస్తున్న మిచెల్ స్టార్క్ (Mitchell Starc ) మరో రికార్డు సృష్టించాడు. గబ్బాలో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టు(Pink Bll Test)లో ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను కూల్చిన స్టార్క్.. సుదీర్ఘ ఫార్మాట్లో తోపు బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదో వికెట్ తీశాక పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ (Wasim Akram)ను దాటేసిన స్టార్క్.. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతివాటం పేసర్‌గా అవతరించాడు. ప్రస్తుతం స్టార్క్ ఖాతాలో 415 వికెట్లు ఉన్నాయి.
ప్రపంచంలోని అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా ఎదిగిన మిచెల్ స్టార్క్ రికార్డులను తిరగరాస్తున్నాడు. స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తున్న ఈ పేస్ గన్ … గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆల్‌టైమ్ రికార్డు పట్టేశాడు. హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసిన స్టార్క్.. పాక్ దిగ్గజం వసీం అక్రమ్‌ను వెనక్కి నెట్టేశాడు. అక్రం 104 టెస్టుల్లో వికెట్లు తీయగా.. ఆసీస్ స్పీడ్‌స్టర్ 102 మ్యాచ్ పూర్తికాక ముందే ఈ ఫీట్ సాధించాడు. 2011లో తన టెస్టు కెరీర్ మొదలైన గబ్బా మైదానంలోనే ఈ కంగారూ పేసర్ వికెట్ల వీరుడిగా చరిత్ర లిఖించడం విశేషం.
Mitchell Starc goes past Wasim Akram as the most prolific left arm quick of all time 👏 pic.twitter.com/CdTtnk51QH
— 7Cricket (@7Cricket) December 4, 2025
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ఆర్మ్ పేసర్ల జాబితాలో శ్రీలంక వెటరన్ చమింద వాస్(Chaminda Vaas) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 317 వికెట్లతో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) నాలుగో స్థానంలో ఉండగా.. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) 311 వికెట్లతో ఐదో ప్లేస్‌లో నిలిచాడు. ఒకప్పుడు లంక ప్రధాన పేసరైన వాస్ 111 మ్యాచుల్లో 29.598 సగటుతో 355 వికెట్లు పడగొట్టాడు.
నిరుడు నవంబర్‌లో స్టార్క్ వన్డేల్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో నిప్పులు చెరిగిన ఈ పొడగరి పేసర్ సొంతగడ్డపై అత్యంత వేగంగా వికెట్ల సెంచరీ కొట్టేశాడు. తద్వారా మాజీ పేసర్ బ్రెట్ లీ (Brett Lee) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. పాక్ ఆటగాడు సయీం ఆయూబ్ వికెట్ తీసిన స్టార్క్ 54 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయికి చేరుకున్నాడు. దాంతో, 55 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన బ్రెట్ లీ రెండో ర్యాంకుకు పడిపోయాడు.
Mitchell Starc passes Wasim Akram as the most prolific left-arm bowler in Test cricket history 🤩#Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/gxzYjLGR2S
— cricket.com.au (@cricketcomau) December 4, 2025