Ashes Series : స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) జోరు కొనసాగుతోంది. పెర్త్‌లో రెండో రోజే ఇంగ్లండ్‌ను ఓడించిన ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టు (Pink Ball Test)లోనూ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్(2-48), స్కాట్ బొలాండ్(2-33)ల ప్రత్యర్థి జట్టును వణికించగా సగం వికెట్లు తీసింది. ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరగా స్టోక్స్ సేన ఇంకా 43 పరుగులు వెనకబడిది. నాలుగోరోజు టెయిలెండర్లను త్వరగా చుట్టేస్తే.. కంగారూ టీమ్ వరుసగా రెండో విజయం సాధించడం లాంఛనమే.
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. పెర్త్‌లో దారుణ ఓటమి చవిచూసిన బెన్ స్టోక్స్ సేన.. గబ్బాలో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్(1378 నాటౌట్) అజేయ శతకంతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా మరోసారి పైచేయి సాధించింది. ఇంగ్లిష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ వెథర్లాండ్(72), లబూసేన్(65), మిచెల్ స్టార్క్(77), స్టీవెన్ స్మిత్(61), అలెక్స్ క్యారీ(63)ల అర్ధ శతకాలతో ఆసీస్‌కు భారీ స్కోర్ అందించారు. 416కే ఎనిమిది వికెట్లు పడిన ఆతిథ్య జట్టు స్టార్క్ హాఫ్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులకు ఆలౌటయ్యింది.
Australia are surging towards a 2-0 lead with England facing a momentous battle to keep their Ashes hopes alive 😳
Scorecard: https://t.co/VRsMzvlE6q pic.twitter.com/GieS8nImrT
— ESPNcricinfo (@ESPNcricinfo) December 6, 2025
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ చూస్తుండగానే కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జాక్ క్రాలే(44), బెన్ డకెట్(15) శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 48 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని విడదీసిన బోలాండ్ వికెట్ల వేటకు తెరతీశాడు. కాసేపటికే ఓలీ పోప్(26)ను నేసర్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. ఆ తర్వాత బొలాండ్ (2-33), స్టార్క్(2-48) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రూట్(15), హ్యారీ బ్రూక్(15), జేమీ స్మిత్(4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
Joe Root has fallen to Mitchell Starc each of the three times he’s been dismissed this series 👀
A potentially series-defining moment at the Gabba!#AUSvENG #Ashes pic.twitter.com/wzsJHiATzC
— ESPNcricinfo (@ESPNcricinfo) December 6, 2025
ఆసీస్ పేసర్ల జోరుతో 128కే ఆరు వికెట్లు పడిన జట్టును ఆదుకునేందుకు బెన్ స్టోక్స్(4 నాటౌట్), విల్ జాక్స్(4 నాటౌట్) ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ అజేయంగా నిలవగా మూడోరోజు ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 43 రన్స్ వెనకబడి ఉంది. నాలుగో రోజు తొలి సెషన్లో స్టోక్స్, జాక్స్ నిలబడితే సరి. లేదంటే ఇంగ్లండ్‌కు మరో పరాభవం ఎదురవ్వడం ఖాయం.