John Cena : ప్రముఖ రెజ్లర్ WWE స్టార్ జాన్ సినా (John Cena) కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగే రెసల్మేనియా తన చివరి పోటీ అని తెలిపారు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) మనీ ఈవెంట్‌కు హాజరైన సినా ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన చేశారు.
జాన్ సినా 2001లో రెజ్లింగ్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 16 సార్లు WWE ఛాంపియన్‌గా నిలిచారు. జాన్ సినా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. టీవీ షోల్లోనూ సందడి చేశారు. ‘దాదాపు రెండు దశాబ్దాలకుపైగా రెజ్లింగ్‌లో (wrestling) ఉన్నా. ఎన్నో అనుభవాలను ఆస్వాదించా’ అని జాన్ సినా తెలిపాడు.
‘ఇప్పుడు వీడ్కోలు నిర్ణయం తీసుకొనేందుకు సరైన సమయం వచ్చిందని భావిస్తున్నా. డబ్ల్యూడబ్ల్యూఈకి ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేం. ఎల్లవేళలా మద్దతుగా నిలిచే అభిమానులే కీలకం. వారి వల్లే కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్లగలం. నా రెజ్లింగ్ కెరీర్లో తెలుసుకొన్నది ఒక్కటే. కెనడా వాసులు ఎప్పుడూ రెజ్లింగ్‌ను ఆదరిస్తూనే ఉంటారు’ అని సినా పేర్కొన్నాడు.