భువనేశ్వర్: స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యాడు. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటడం ద్వారా శ్రీశంకర్ ప్రపంచ పోటీలకు అర్హత సాధించాడు.
శనివారం పురుషుల లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్ రౌండ్లో శ్రీశంకర్ తొలి ప్రయత్నంలోనే 8.42 మీటర్ల దూరం లంఘించి సెకను తేడాతో జాతీయ రికార్డు బద్దలు కొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జెస్విన్ అడ్రిన్ (7.83 మీటర్లు), మహమ్మద్ అనీస్ (7.71 మీ.) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.