Womens World Cup : ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens World Cup 2025) మ్యాచ్‌లపై సందిగ్ధత నెలకొంది. భారత, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన వాటిలో చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) ఉండడమే అందుకు కారణం. జూన్ 4 తొక్కిసలాట (Stampede) జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకూ ఈ మైదానంలో క్రికెట్ ఊసే లేదు.
పదకొండు మంది అభిమానుల మృతికి కారణమైనందుకు కర్నాటక క్రికెట్ సంఘానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. దాంతో, ఆగస్టు 11 నుంచి జరగాల్సిన మహారాజా టీ20 టోర్నీ సైతం చిన్నస్వామి నుంచి మైసూర్‌కు తరలిపోయింది. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో కాకుండా ఇతర నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరపాలనే ఉద్దేశంతో ఉన్నాయి ఐసీసీ, బీసీసీఐ.
🚨 REPORTS 🚨
Women’s World Cup games in Bengaluru are uncertain as KSCA awaits government clearance to host matches at the M. Chinnaswamy Stadium. 🏏#WomensWorldCup #Bengaluru #KSCA #MChinnaswamyStadium #CricketNews #SportsUpdate #WorldCup2025 #GovernmentClearance pic.twitter.com/OhSqsw5LJ3
— FMPLAY NEWS (@FMPlay247news) August 8, 2025
మహిళల వన్డే వరల్డ్ కప్ పదమూడో సీజన్ సెప్టెంబర్ 30న మొదలు కానుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహిళల వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. కాబట్టి అయితే.. సింహభాగం మ్యాచ్‌లు ఇండియాలోనే జరిపేలా షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. ఇండియాలోని నాలుగు స్టేడియాల్లో.. లంకలోని ఒక స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈసారి టైటిల్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు ‘నువ్వానేనా’ అన్నట్టు తలపడనున్నాయి.
చిన్నస్వామి స్టేడియం
సెప్టెంబర్ 30న జరుగబోయే ఆరంభ పోరులో బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది. తొలి సెమీ ఫైనల్ అక్టోబర్ 29న గువాహటి లేదా కొలంబోలో, రెండో సెమీస్ అక్టోబర్ 30న బెంగళూరులో జరగాలి. కానీ, ఎన్ఓసీ వస్తే తప్ప చిన్నస్వామిలో మ్యాచ్‌లు జరగడం అసాధ్యం. దాంతో.. రెండో సెమీఫైనల్ వేదిక మారే అవకాశముంది. రెండు రోజుల విరామం అనంతరం నవంబర్ 2 న విజేత ఎవరో తేలిపోనుంది. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు)/ వేదిక మారే అవకాశముంది. ఏసీఏ స్టేడియం(గువాహటి), హోల్కర్ మైదానం(ఇండోర్), ఏసీఏ-వీడీసీఏ స్టేడియం(విశాఖపట్టణం)లో, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం మెగా టోర్నీ మ్యాచ్‌లకు వేదిక కానుంది. 2022లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టనుంది.